TAMA Divya Deepavali - Details
Location : Online Event
5490 McGinnis Village Place
Alpharetta, GA 30005
దివ్యంగా సాగిన తామా దివ్య దీపావళి
అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆద్వర్యంలో దీపావళి వేడుకలు నవంబర్ 21న ఆన్లైన్ జూమ్ ద్వారా ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో షుమారు 250 మందికి పైగా అట్లాంటా వాసులు పాల్గొన్నారు. ఎస్ ఎల్ ఆర్ మోర్ట్ గజ్, సిటీ ఎయిర్ ట్రావెల్స్, శాంప్రసాఫ్ట్, పటేల్ బ్రదర్స్ మరియు శ్రీ. గిరీష్ మోడి సమర్పకులుగా వ్యవహరించారు. తామా సాంస్కృతిక కార్యదర్శి సురేష్ బండారు స్వాగతోపన్యాసం చేస్తూ, అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత వేడుకలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన తామా అధ్యక్షులు భరత్ మద్దినేని గత పది నెలల కాలంలో తామా నిర్వహించిన కార్యక్రమాలు, సాధించిన లక్ష్యాలను వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే దీపావళి అంటూ పండగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు. మధుళిక పసుమర్తి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
సుప్రసిద్ధ గాయనీగాయకులు మోహన భోగరాజు, అనుదీప్ దేవరకొండ వైవిధ్యభరిత గీతాలను ఆలపించి కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తెచ్చారు. మోహన్ ఈదర తామా 2020 వార్షిక సంచికను ఆవిష్కరించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అట్లాంటా చిన్నారులు మరియు ప్రాంతీయ కళాకారులు చేసిన వైవిధ్యమైన నృత్యాలు, మధుర గీతాలు, నాటకాలు, పాటలు, శ్లోకాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి. యాంకర్ మధుళిక వ్యాఖ్యానం అందరినీ అబ్బురపరిచింది.
శ్రీ శ్రీనివాసరావు రాయపురెడ్డి మెమోరియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డును మాలిని ఆకుల గారికి అందజేశారు. ఈ సందర్భగా రాయపురెడ్డిని, తాను తామాకి అలాగే తెలుగు కమ్యూనిటీ మొత్తానికి చేసిన సేవలను మల్లిక్ మేదరమెట్ల గుర్తుచేశారు. అధ్యక్షులు భరత్ మద్దినేని తామా తదుపరి కార్యవర్గాన్ని సభకు పరిచయం చేసారు. చివరగా దీపావళి వేడుకలను అత్యద్భుతంగా విజయవంతం చేసిన అట్లాంటా తెలుగు ప్రజలకి, స్పాన్సర్స్ కి, ఇన్నయ్య ఎనుముల గారు కృతజ్ఞతలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
