Mayabazaar Theatrical Drama - Details
Location : Online Event
5490 McGinnis Village Place
Alpharetta, GA 30005
అలరించిన తామా - సురభి డ్రామా థియేటర్ వారి మాయాబజార్ నాటకం
నవంబర్ ఒకటవ తేదీన అట్లాంటా తెలుగు సంఘం (తామా) వారు సురభి డ్రామా ధియేటర్ వారిచే సుప్రసిద్ధ పౌరాణిక నాటకం మాయాబజజార్ ఆన్లైన్ లో ప్రదర్శింపజేశారు. సురభిలో ఉండే కళాకారులు తరతరాలుగా నాటకాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం నాటక రంగానికి ఆదరణ లేదని తెలిసినా కూడా నమ్ముకున్న కళని వదులుకోవడం ఇష్టంలేక పూర్వికులు ఇచ్చిన గొప్ప సంపద అని భావించి కొనసాగిస్తున్నారు. అటువంటి సమయం లో "సురభి డ్రామా థియేటర్" డైరెక్టర్ మరియు నటులు సురభి జయానంద్ గారు తామా ని సంప్రదించడం జరిగింది. తామా మన కళలకు, సంప్రదాయాలకు ఎప్పుడూ పెద్దపీటే వేస్తుంది, కావున వారు అడగ్గానే వెంటనే ఒప్పుకోవడం జరిగింది. తామా తరపున మరియు దాతల ద్వారా సేకరించిన సుమారు రెండు లక్షల రూపాయలు సురభి డ్రామా థియేటర్ వారికి అందించడం జరిగింది.
ముందుగా తామా సాంఘికసేవా కార్యదర్శి సాయిరామ్ కారుమంచి అందరినీ ఆహ్వానించి, సురభి డ్రామా థియేటర్ గురించి ప్రస్తావించారు. అటు పిమ్మట సురభి డ్రామా థియేటర్ అధ్యక్షులు సురభి వాసుదేవరావు గారు సురభి నాటకాలు దృశ్య నాటకమని, భారీ సెట్టింగ్‌లు, ట్రిక్స్ సీన్స్, వైర్ వర్క్‌లతో 60మంది కళాకారులతో సమిష్టిగా కలసి ప్రదర్శనలు ఇస్తున్నామని, చంటి బిడ్డనుంచి పెద్దలవరకు నాటకాలు ప్రదర్శనలు ఇస్తారని, పద్యనాటకం తెలుగువారి సొత్తు అన్నారు.
తామా అధ్యక్షులు భరత్ మద్దినేని అట్లాంటా తెలుగు సంఘం గత 39 సంవత్సరాలగా తెలుగు వారి ప్రతినిధిగా ఎలా వున్నదో చెప్తూ, సాహిత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలో తామా పాత్ర, అలానే ఉచిత క్లినిక్, మనబడి తెలుగు తరగతులు, స్కాలర్షిప్స్ గురించి వివరించారు. సురభి డ్రామా థియేటర్ ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయనీ, కళలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నామని, వీలైతే వారికి సహాయంచేయాలని ప్రేక్షకులకు తెలియజేస్తూ, తామా వెబ్సైటు లేక ఫేస్బుక్ లో డొనేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేసారు.
చీకటి వెలుగుల మధ్య నారదుడు ఆకాశం నుండి మబ్బుల మధ్యలో కిందికి దిగి వచ్చినట్టు వున్న దృశ్యంతో నాటకం మొదలయ్యింది. వెండి తెరమీద సినిమా చూస్తున్నామా, స్టేజి మీద నాటకం చూస్తున్నామా అనే అనుమానంవచ్చేలా ఎంతో బాగా చేశారు. కన్ను మూసి తెరిచేలోపు లొకేషన్ మారిపోయింది. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే దృశ్యాలు (తెరలు) నిజమైన రాజభవనాలు, రోడ్లు అన్నంత విస్మయం గొలిపాయి. కెమెరా జిమ్మిక్కులు లేవు, కంప్యూటర్ గ్రాఫిక్స్లూ లేవు. అయినా వాటిని తలదన్నేలా మాయలు, మంత్రాలు కళ్ళముందే ప్రత్యక్షమవుతాయి. రెప్ప వేసి తెరిచేలోగా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇవి ఏ మహేంద్రజాల విద్య తెలిసిన వ్యక్తో చేసినవి కాదు. తామా మాయాబజార్ నాటకంలో కనిపించే దృశ్యాలు.
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా సందర్భాన్ని బట్టి వివిధ వేషాలు వేసి రక్తి కట్టించారు. ఘతోత్కచుడు, హిడింబి ల ఆహార్యం, అలంకరణ అదనపు ఆకర్షణ. చాలా మంది పెద్దవారు తమ పిల్లలతో సహా ఈ నాటకాన్ని చూడటం జరిగింది. వారి ప్రోత్సాహకరమైన మాటలు తామా వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడం, భవిష్యత్తులో కూడా ఇలాంటి నాటకాలను మరిన్ని ప్రదర్శించాలనుకోవడం ఒక మంచి సూచన. ఇంత చక్కటి నాటకాలు ప్రదర్శించి కళను బతికించుకుంటున్న వారిని ఆదరించడం, ప్రోత్సహించడం మన అందరి బాధ్యత.
నాటకం ముగిసిన తరువాత సురభి డ్రామా థియేటర్ కార్యదర్శి సురభి జయానంద్ గారు పాత్రలను పరిచయం చేశారు. తామంతా ఒక కుటుంబం అనీ, నాటకమే తమ జీవితమనీ, ఈ కళను మరింత ప్రోత్సహించాలనీ కోరుకున్నారు. ఈ కరోనా కష్టకాలంలో అడగ గానే అవకాశం ఇచ్చిన తామా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ముందు నుండీ తమతో మాట్లాడుతూ, వివిధ విషయాలను అనుసంధానిస్తూ ఈ నాటకం ఇంత గొప్పగా రావటానికి కారణమయిన భరత్ మద్దినేని గారికి, సాయిరామ్ కారుమంచి గారికి, హితేష్ వడ్లమూడి గారికి, రుపేంద్ర వేములపల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తామా ఉపాధ్యక్షులు ఇన్నయ్య ఎనుముల ఈ అద్భుతమైన కళాఖండాన్ని అందరికీ ప్రదర్శించిన కళాకారుల కృషిని కొనియాడారు. సురభి వాసుదేవరావు గారికి, సురభి జయానంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే, వాలంటీర్స్ కీ, కళాకారులకు, నాటకం వీక్షించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభినందనాలు తెలియజేసారు. ఈ అద్భుతమైన నాటకరంగాన్ని ముందుతరాల వారికి అందిద్దాం అని చెప్పి కార్యక్రమాన్ని ముగించారు.
Mayabazaar Theatrical Drama

With their sole means of livelihood being out of bounds, members of Surabhi Drama Theatre are seeking funds to tide over the crisis.
Members of Hyderabad-based ‘Surabhi Drama Theatre’, a group known for its colorful and elaborately staged mythological dramas in Surabhi theatre tradition, find themselves at the crossroads after the Coronavirus outbreak. The primary means of livelihood for at least 50 families residing in Surabhi Colony in Serilingampally, comprising 200 artistes, is by staging plays. Public performances were called off early March due to the pandemic, and since then these theatre artistes have been out of work and are seeking help.
Telugu Association of Metro Atlanta (TAMA) humbly asks you for your generous support in assisting the families. Any contribution would be greatly appreciated. No amount is too small.
Please donate generously.
If you would like to mail a check, please send to the following address:
Telugu Association of Metro Atlanta 5490 McGinnis Ferry Rd,Suite 117, Alpharetta GA 30005.
Please contact us at (404) 946-TAMA (8262) or send email to info@tama.org for any help.